ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదని కేంద్రం అధికారికంగా ప్రకటన చేసింది. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి సిన్హా ఈ మేరకు స్పష్టం చేశారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు జీరో అవర్‌లో సిన్హా రాతపూర్వంగా జవాబిచ్చారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని, ఇప్పుడు కొత్తగా నిబంధనలను మార్చలేమని స్పష్టం చేశారు.
ఇటీవలే రాజ్యసభలో ఎంపీ కేవీపీ రామచందర్‌రావు ప్రైవేటు మెంబర్ బిల్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని చర్చకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలు జేడీశీలం, సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టారు. అదే సమయంలో హోంశాఖ సహాయ మంత్రి హెచ్‌పీ చౌదరి స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నారు. తాజాగా సిన్హా కూడా ప్రత్యేక హోదా లేదంటూ అధికారిక ప్రకటన ఇవ్వడం ఏపీలో ప్రకంపనలకు దారి తీసింది.
No comments:
Post a Comment